విద్య‌ను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు

Revanth Reddy Fires On CM KCR. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్

By Medi Samrat  Published on  18 Jan 2022 9:05 AM GMT
విద్య‌ను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తాయి.. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటున్నార‌ని విమ‌ర్శించారు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు?.. టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం ఎలా చదువును అందిస్తారు? అని ప్ర‌శ్న‌లు సంధించారు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలల‌ను అన్నింటినీ మూసివేశారని.. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మండిప‌డ్డారు.

రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తే పేదలు బాగుపడుతారు. కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాలను చేపట్టారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెక్క లేదు.. అందుకే మోదీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదు.. అయినా వాటిని మూసివేశారని అన్నారు. పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయి.. అయినా వాటిని నియంత్రణ చేయరు.. ఎందుకంటే ఆదాయం ఉంటుంది కాబట్టి అని అన్నారు.

ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసార‌ని.. చదువును దూరం చేసి గొర్లు- బర్లు- చేపలు ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు. విద్యకు పెట్టె నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు.. సమాజం దృష్టిలో పెట్టుబడి అని అన్నారు. తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే.. జార్జ్ రెడ్డిలాంటి లీడర్లు పుట్టారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని.. కేసీఆర్ మనువాది అని విమ‌ర్శించారు. ఉద్యోగుల భర్తీ లేకుండా.. ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదని వ్యాఖ్యానించారు.


Next Story
Share it