మోదీ, కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని అలా చేస్తున్నారు

Revanth Reddy Fires On CM KCR. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో కల్లాలలో కాంగ్రెస్

By Medi Samrat  Published on  19 Nov 2021 2:43 PM GMT
మోదీ, కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని అలా చేస్తున్నారు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో కల్లాలలో కాంగ్రెస్ కార్యక్రమం చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బిక్కనూర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ చేయక పోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నార‌ని.. పార్లమెంటు సమావేశాల‌లో రైతుల సమస్యల గురించి విన్నవిస్తాన‌ని తెలిపారు. రైతులే కేసిఆర్ కు నాగలి కట్టి దున్నిచ్చే రోజులు వస్తాయని రేవంత్ వ్యాఖ్యానించారు.

మోదీ, కేసీఆర్ లకు రైతులు త‌గిన బుద్ధి చెబుతార‌ని.. రైతుల జోలికి వచ్చినోల్లు ఎవ్వరూ బాగుపడలేద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. నిండు అసెంబ్లీలో రైతుల సమస్యలని పరిష్కారిస్తామని చెప్పి కేసీఆర్ రైతుల‌ను మోసం చేశార‌ని ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని.. మోదీ, కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకోని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.


Next Story
Share it