తెలంగాణ తల్లిని కాదని.. తెలుగు తల్లికి పెద్ద పీట వేశారు

Revanth Reddy Fires On CM KCR. టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు

By Medi Samrat  Published on  25 Oct 2021 1:59 PM GMT
తెలంగాణ తల్లిని కాదని.. తెలుగు తల్లికి పెద్ద పీట వేశారు

టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. జలదృశ్యం నుండి జన దృశ్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఉద్యమం ముసుగులో శవాల పునాదుల మీద గులాబీ పార్టీని విస్తరించార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన టీఆర్ఎస్ జెండాలే.. సామాన్య ప్రజలు నగరంలో టు లెట్ బోర్డ్ పెడితే.. 2 వేల జరిమానా వేసింది జీహెచ్ఎంసీ. నగరంలో ఎక్కడ చూసిన గులాబీ జెండాలు, ఫ్లెక్సీ లు పెట్టారు. కాంగ్రెస్ నేతల‌ విగ్రహాలకు సైతం టీఆర్ఎస్ జెండాలు కట్టారు. సిగ్గు లేకుండా కళ్లు మూసుకుపోయి కట్టారని తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

20 ఏళ్ల క్రితం మొదలైన జలదృష్యం.. అవినీతి దృశ్యంగా మారిందని.. నడమంత్రపు సిరి వస్తే.. ఎట్లా వ్యవహరిస్తారో.. అట్లా చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలని విమ‌ర్శించారు. తెలుగు తల్లి.. ఎవరికి తల్లి అన్న‌ కేసీఆర్.. ఇవాళ‌ టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా.. తెలుగు తల్లిని పెట్టార‌ని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లిని కాదని.. తెలుగు తల్లికి పెద్ద పీట వేశారని మండిప‌డ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే.. వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమ‌ర్శించారు. మొదటి నుండి టీఆర్ఎస్ లో వున్న వాళ్ళు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మ‌రించుకున్నారా.. అని ప్ర‌శ్నించారు.

2001 జల దృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు వేల కోట్లకు ఎగపాకిందని విమ‌ర్శించారు. కొండా లక్ష్మణ బాపుజీ, బియ్యాల జనార్దన్ రావు, జయశంకర్ సార్, కేశవ రావు, గూడ‌ అంజయ్య, సాంబ శివుడు, రహ్మాన్ ఇలా చాలా మంది చివరి నిమిషం వరకు కేసీఆర్ కోసం పనిచేశారని.. గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, పాపారావు, విజయ రామరావు, ఆలే నరేంద్ర, విజయ శాంతి ఎవర్ని గుర్తుచేసుకోలేద‌ని ఫైర్ అయ్యారు. ఈటెల పార్టీ నుండి బయటకి పంపిండు.. హరీష్ రావును హుజురాబాద్ లో చెట్టుకు కట్టిండు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మ‌లే ప్లీనరీలో పెట్టుకున్నారని విమ‌ర్శించారు.


Next Story
Share it