ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. యుద్ధానికి మేం సిద్ధం : రేవంత్

Revanth Reddy Fire On TRS Govt. కాంగ్రెస్ గాంధీ భ‌వ‌న్ వేదిక‌గా నిరుద్యోగ నిరసన దీక్ష చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా

By Medi Samrat  Published on  27 Feb 2022 1:24 PM GMT
ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. యుద్ధానికి మేం సిద్ధం : రేవంత్

కాంగ్రెస్ గాంధీ భ‌వ‌న్ వేదిక‌గా నిరుద్యోగ నిరసన దీక్ష చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నిరుద్యోగుల హక్కులని ఆనాడు ఇందిరాగాంధీ కాపాడారని అన్నారు. చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను గోడల మీద రాతలు రాసానని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్‌లో కొట్లాడిన వాళ్ళకే టికెట్లు వస్తాయని స్ప‌ష్టం చేశారు. మధ్యలో వచ్చిన టీఆర్ఎస్ తెలంగాణకు మేము ఓనర్లం అని చెప్పుకుంటున్నారని.. యువకుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటం అడుతున్నారని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ అద్యక్షుడు కంటే.. నాకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటేనే ఇష్టమ‌ని.. నేను యూత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యంటే కేసీఆర్‌కు గునపం గుచ్చేవాడినని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బిస్వాల్ కమిటీ లక్ష తొంబై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింద‌ని.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి 8 సంవత్సరాలు అయ్యింద‌ని అన్నారు. హరీష్ రావు నీకు నీ పార్టీకి ఉద్యోగాలు వచ్చాయి.. నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలేదని.. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఇప్పటివరకు కొట్టివేయ‌లేద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌ని.. అందుకోసం అవసరమైతే సోనియాగాందీ కాళ్ళు పట్టుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామ‌ని.. ప్రగతి భవన్‌ను అంబేద్క‌ర్‌ భవన్ గా మారుస్తూ మొదటి సంతకం పెడతామ‌ని అన్నారు. కేసీఆర్ నీవు మ‌గాడివి అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చెయ్.. మేము యుద్దానికి సిద్దంగా వున్నాం.. నీకు చేత కాకా ప్రశాంత్ కిశోర్ నీ తెచ్చుకున్నావు అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.


Next Story
Share it