తాగుబోతుల తెలంగాణగా మార్చారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On CM KCR. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చార‌ని టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  18 Oct 2022 8:15 PM IST
తాగుబోతుల తెలంగాణగా మార్చారు : రేవంత్ రెడ్డి

బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చార‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యేనాటికి లిక్కర్ తో రాష్ట్ర ఆదాయం 10వేల కోట్లు ఉండేది. కానీ ఎనిమిదేళ్లలో 36 వేల కోట్లకు పెరిగిందని.. ఇది మా ఆడబిడ్డల రెక్కల కష్టం కాదా? అని అడిగారు. అమరుల త్యాగాలు ఇలాంటి తెలంగాణ కోసమా?.. పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అని ప్ర‌శ్నించారు.

మునుగోడు ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించండి.. తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చినందుకు కేసీఆర్ ను చెప్పుతో కొట్టినా తప్పులేదని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. లక్కారం చెరువు నిండితే కాలువలు తీసే సోయి కేసీఆర్ కు లేదు.. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే స్రవంతిని గెలిపించండని కోరారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యముంటే ఆడబిడ్డ సవాల్ ను స్వీకరించండి.. మందు పోయకుండా ఓటు అడుగుతామని నరసింహ స్వామి మీద ప్రమాణం చేయాల‌ని స‌వాల్ విసిరారు.




Next Story