కాంగ్రెస్ పార్టీ జెండాను కిందపడనివ్వం

Revanth Reddy Fire On CM KCR. వచ్చే సంవత్సరం జూన్, జులై లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  7 July 2022 3:30 PM GMT
కాంగ్రెస్ పార్టీ జెండాను కిందపడనివ్వం

వచ్చే సంవత్సరం జూన్, జులై లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై దుష్పచారం చేస్తే వారి పై చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. 365 రోజుల తర్వాత సోనియా గాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెపితే వారిని పల్లకిలో మూసికెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతామ‌ని అన్నారు. నా లక్కీ నెంబర్ 9.. అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కి అధికారం ఇవ్వాలని ప్రజలని కోరారు. బీజేపీ, టిఆర్ఎస్ కంటే ఎక్కువగా పెరేడ్ గ్రౌండ్‌లో మేం సభ నిర్వహించి తీరుతామ‌ని అన్నారు.

ఇదే రోజూ సోనియా గాంధీ ఇచ్చిన బాధ్యతలని మేము తీసుకున్నామ‌ని.. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నేతలు చేరుతున్నారని అన్నారు. ప్రధాని, సీఎం పదవుల కంటే అత్యంత ముఖ్యమైన పదవి అధ్యక్ష పదవి అని.. అంత గొప్ప పదవిని సోనియాగాందీ నాకు ఇచ్చారని.. రాహుల్ గాంధీకి నేను హనుమంతుడిలా పని చేస్తానని తెలిపారు.

కేసీఆర్ రావాణాసురుడిలాంటి వాడు.. ఆయనను అంతమిదించేందుకు యుద్ధం చేస్తామ‌ని అన్నారు. నేను పదవి భాద్యతలు స్వీకరించిన తరువాత నిత్యవసర ధరల పెంపుపై పెద్ద ఎత్తున‌ నిరసన కార్యక్రమలు చేశామ‌ని వెల్ల‌డించారు. దళితులకు అండగా దళిత గిరిజన దండోరా సభలను నిర్వహించాం.. రెండు లక్షల మందితో ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభని నిర్వహించామ‌ని అన్నారు. మూడుచింతల పల్లిలో రెండు రోజులు నిరసన దీక్ష చేశామ‌ని.. పాలమూరు గడ్డపై నిరుద్యోగులకు అండగా విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించామ‌ని.. రైతులు పండించిన ధాన్యం కేసీఆర్ మెడలు ఒంచి కొనిపించామ‌ని తెలిపారు.

వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ వేదిక గా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. క‌క్షతో గాంధీ కుటుంబంపై ఈడీ కేసులు పెట్టారని.. దానికి నిరసనగా పెద్ద ఎతున్న ఈడీ ఆఫీస్ ముందు నిరసనలు చేశామ‌ని.. రాజ్ భవన్ ని వేలాది మందితో ముట్టడించామ‌ని అన్నారు. 90 రోజుల్లో డిజిటల్ సభ్య‌త్య‌ కార్యక్రమంలో 45 లక్షలు చేశామ‌ని.. హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓటమితో నేను కుంగిపోతే.. నాకు అండగా కార్యకర్తలు నిలబడ్డారని తెలిపారు. ప్రతీ ఓటమి గెలుపుకి పునాది అవుతుందని.. కాంగ్రెస్ పార్టీ జెండాని కిందపడనివ్వం అని రేవంత్ ప్ర‌సంగించారు.

Next Story
Share it