కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా.? : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On CM KCR. సీఎం కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని టీపీసీసీ అధ్య‌క్షుడు

By Medi Samrat  Published on  17 Feb 2022 6:33 AM GMT
కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా.? : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందని రేవంత్ అన్నారు. కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు మద్ధతుగా మెగా నోటిఫికేషన్ డిమాండ్‌తో అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయండని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల‌ను ఆదేశించారు.

అంత‌కుముందు.. జూబ్లీహిల్స్ ఇంటి వద్ద పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్ట్ లో కేసు ఉన్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు కు వచ్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని తన నివాసం లో పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టుకు సంబందించిన కారణాలు ఏమి తెలపలేదు. కేవలం కమిషనర్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం ఉన్న నేపథ్యంలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని.. లేకపోతే గాడిదల ముందు కేక్ కట్ చేసి నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు గోల్కొండ పోలీసు స్టేషన్ కు తరలించారు.


Next Story