డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On Center. సోమాజిగూడ కత్రియా హోటల్ లో జ‌రిగిన‌ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్

By Medi Samrat  Published on  9 Jun 2023 9:26 AM GMT
డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని : రేవంత్ రెడ్డి

సోమాజిగూడ కత్రియా హోటల్ లో జ‌రిగిన‌ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని అన్నారు. రాజకీయ భవిష్యత్ కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక అని.. ఇందుకు ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే గారే మనకు ఉదాహరణ అని సూచించారు.

1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని రేవంత్ అన్నారు. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని.. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమ‌ర్శించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేద్దామ‌ని పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం.. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని సూచించారు.












Next Story