మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On Center. దేశ సరిహద్దులను ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని మోదీ స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  4 Jan 2023 12:06 PM IST
మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదు : రేవంత్ రెడ్డి

దేశ సరిహద్దులను ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని మోదీ స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినిపల్లి గాంధీ ఐడియాలోజి కేంద్రంలో జ‌రిగిన‌ శిక్షణా కార్యక్రమంకు హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదని.. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారని కొనియాడారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. దేశంలో విష్చిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారని తెలిపారు.

జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ప్రతీ గడపను తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు.

ధరణి తో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై , కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దాం.. వాటిని ప్రజల్లోకి తీసుకెళదాం అని అన్నారు. నిపుణులు అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దాం అన్నారు. 2003లో ఎలాంటి విపత్కర పరిస్థులను ప్రజలు ఎదుర్కొన్నారో.. 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని.. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రేస్ మాత్ర‌మేన‌ని అన్నారు. మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదని.. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని రేవంత్ రెడ్డి అన్నారు.



Next Story