ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగుతాయి : రేవంత్
Revanth Reddy Fire On Center. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 6 April 2022 11:52 AM ISTప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంట చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలని.. కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలు విశ్వసించాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఐదు అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలని.. రైతులకు భరోసా వచ్చే వరకూ.. ప్రతి వరి గింజ కొనేవరకూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఖరిపైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. రైతులకు నష్టం చేసే పరిస్థితులు కల్పిస్తున్నారని రేవంత్ అన్నారు. ముడి బియ్యం, ఉక్కుడు బియ్యం అంటూ ఒకరిపైన ఒకరు ప్రకటనలు చేసుకుంటూ ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఏ బియ్యం అయిన కొనండి కానీ.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మనం పోరాటం చెయ్యాలని సూచించారు.
రేపు విద్యుత్ సౌద, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి పెద్దఎత్తున జరగాలని.. ప్రతి నాయకుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.. టిఆర్ఎస్ ఉద్యమాలను అడ్డుకునే కుట్ర చేస్తుందని.. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగించాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్‌లో ధాన్యం క్వింటాల్ కు మద్దతు ధర 1960 క్వింటాలుతో పాటు 600 రూపాయలు బోనస్ ఇస్తూ కొంటున్నాం అని తెలిపారు.