ఒక్క హామీ నెరవేర్చకుండా మ‌ళ్లీ గెలిపించ‌మ‌ని అడుగుతున్నారు : రేవంత్

కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడే దౌల్తాబాద్ లో అభివృద్ధి, సంక్షేమం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  13 Nov 2023 5:00 PM IST
ఒక్క హామీ నెరవేర్చకుండా మ‌ళ్లీ గెలిపించ‌మ‌ని అడుగుతున్నారు : రేవంత్

కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడే దౌల్తాబాద్ లో అభివృద్ధి, సంక్షేమం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ లో ఆయ‌న మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు.. పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని నేతలు మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు నేను తీసుకొచ్చినవేన‌ని గుర్తుచేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామ‌ని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామ‌న్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామ‌ని.. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తామ‌ని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తామ‌ని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామ‌న్నారు. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తామ‌ని పేర్కొన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప‌థ‌కం పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.

Next Story