రాజకీయాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అని.. తనది మెరిట్ కోటా అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌కు ఒక రోజు ముందు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయన అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్ రాజకీయ పోరాటమంతా కేసీఆర్‌తోనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన సంగతి కూడా తెలిసిందే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది.