మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం : రేవంత్

Revanth Reddy Comments On Jaggareddy Issue. జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో

By Medi Samrat  Published on  21 Feb 2022 10:36 AM GMT
మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం : రేవంత్

జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారని తెలిపారు. జగ్గారెడ్డి మా నాయకుడని.. మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరాడని అన్నారు. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటామ‌న్న రేవంత్ రెడ్డి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామ‌ని అన్నారు. గతంలో వీహెచ్ పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని అన్నారు. జగ్గారెడ్డి ఇష్యూ.. మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

పీసీసీ చీఫ్ గా కొన్ని నేను బయట మాట్లాటలేనని.. జగ్గారెడ్డి నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని.. నేను రాజకీయాలకు రాకముందు కూడా జగ్గన్నతో నాకు పరిచయం వుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకరావడానికి మేము అందరం కలిసి పనిచేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్లు వచ్చాయని కుంగిపోవద్దని.. మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారని.. ఇలాంటి విషయంలో మనోధైర్యంతో బలంగా ఉండాలని.. నాకు ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా ఎదురయ్యాయని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణ‌ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంట‌ద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.


Next Story
Share it