కేసీఆర్ కామారెడ్డికి ఆ ఉపాయంతోనే వచ్చిండు : రేవంత్

కేసీఆర్ కామారెడ్డికి ఉపాయంతోనే వచ్చిండని.. గజ్వేల్ భూములను కేసీఆర్ పందికొక్కు మేసినట్టు మేసిండని

By Medi Samrat  Published on  28 Nov 2023 2:15 PM IST
కేసీఆర్ కామారెడ్డికి ఆ ఉపాయంతోనే వచ్చిండు : రేవంత్

కేసీఆర్ కామారెడ్డికి ఉపాయంతోనే వచ్చిండని.. గజ్వేల్ భూములను కేసీఆర్ పందికొక్కు మేసినట్టు మేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని బీబీపేటలో ఆమె మాట్లాడుతూ.. అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిండన్నారు. నిజామాబాద్ లో ఓడగొట్టి ప్రజలు కవిత దుకాణం బంద్ చేశారని అన్నారు. కామారెడ్డిలో రైతుల భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీకి దిగిండని.. తెలిసి ఎవరైనా పాముకు పాలు పోస్తారా? అని ప్ర‌శ్నించారు.

నమ్మి కేసీఆర్‌కు ఓటు వేస్తే.. పామును పెంచి పోషించినట్లేన‌న్నారు. ఇన్నాళ్లుగా గుర్తురాని కొనాపూర్ కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందట.. పదేళ్లుగా కేసీఆర్ ఇక్కడి ప్రజలకు చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్ వస్తుంది.. రైతు బంధు ఇస్తుందని తెలిపారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే.. డిసెంబర్ 10 నుంచి మీ ఖాతాలో రైతు బంధు వేసే బాధ్యత మాది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు.

Next Story