టెన్షన్.. టెన్షన్.. హెలీకాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి నేడు హెలీకాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్నారు.

By Medi Samrat  Published on  24 Nov 2023 5:45 PM IST
టెన్షన్.. టెన్షన్.. హెలీకాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి నేడు హెలీకాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ప్రయాణం రద్దు అయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రోడ్డు మార్గాన నకిరేకల్ సభకు రేవంత్ బయలుదేరారు. రేవంత్ రెడ్డి వెంట అద్దంకి దయాకర్ రావు, అయోధ్య రెడ్డి ఉన్నారు. కొద్దిరోజుల కిందట కూడా రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలీకాప్టర్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన కారులో అనుకున్న ప్రాంతానికి ప్రయాణించారు.

తాజాగా తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, ఈడీ సోదాల గురించి ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్‌, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు అంతా గమనించాలని.. ఎన్నికల్లో రెండు పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలు రెండూ కుమ్మక్కు అయ్యాయని అన్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ నేతల ఇళ్లు, ఆఫీసులపై దాడుల చేయిస్తున్నారంటూ ఆరోపించారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలను.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను మోదీ, కేసీఆర్‌ రాజకీయ క్రీడలో పావులుగా మార్చారంటూ మండిపడ్డారు. ఆ రెండు పార్టీల్లో చేరినవారు పవిత్రులు.. ఇతర పార్టీల్లో ఉన్నవారంతా ద్రోహులా అని ప్రశ్నించారు.

Next Story