రేవంత్ రెడ్డి అరెస్ట్‌

Revanth Reddy Arrest. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని తన ఇంటి వద్ద అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

By Medi Samrat  Published on  2 Jan 2023 3:25 PM IST
రేవంత్ రెడ్డి అరెస్ట్‌

టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని తన ఇంటి వద్ద అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ధర్నా చౌక్ కు బయలుదేరేందుకు వెళ్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులకు, రేవంత్ రెడ్డి కి మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి పొలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనల‌కు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలోనే తెల్లవారుజామునుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సహా ముఖ్య నాయకులను అందరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులు కొన‌సాగాయి. గాంధీ భవన్ వ‌ద్ద‌ పోలీసులు భారీగా మొహ‌రించారు. పార్టీ కార్యాలయానికి వస్తున్న నేతలను గేటు వద్దనే అడ్డుకున్నారు పోలీసులు. ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. గాంధీ భవన్ ముందు కేసీఆర్ డిస్టిబొమ్మ దగ్ధం చేసి ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు చరణ్ కౌశిక్ యాదవ్, రవళి రెడ్డి, గోగుల సరిత అధికార ప్రతినిధులు సంకెపల్లి సుదీర్ రెడ్డి, నిజాముద్దీన్, రియాజ్ త‌దిత‌రులను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.



Next Story