కొత్త బాస్ రేవంత్ రెడ్డినే.. ప్రకటించిన కాంగ్రెస్ అధిస్టానం
Revanth Reddy Appointed AS PCC Cheif. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు
By Medi Samrat Published on 26 Jun 2021 3:04 PM GMT
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్ నియామక ప్రకటన విడుదల చేశారు. పీసీసీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది కాంగ్రెస్ అధిస్టానం. ఈ మేరకు అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు అప్పగించింది.
ఇక పీసీసీ రేసులో నేను ఉన్నానని ప్రకటించిన మధుయాష్కీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించింది. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపీశెట్టి నిరంజన్, టి.కుమార్‌రావు, జావెద్ అమీర్‌లను ప్రకటించింది. ఇక రేవంత్‌కు చివరివరకూ గట్టిపోటీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిరాశే ఎదురయ్యింది.