నిఖత్ జరీన్‌కు పారితోషికం ప్రకటించిన రేవంత్‌.. వారికి ఎలా ప్రోత్సాహ‌కాలు ఇచ్చారో అలాగే ఇవ్వాల‌ని డిమాండ్‌..

Revanth Reddy Announce Rs 5 lakh to Nikhat Zareen. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పత‌కం గెలిచిన నిఖత్ జరీన్ ను

By Medi Samrat  Published on  22 May 2022 5:56 PM IST
నిఖత్ జరీన్‌కు పారితోషికం ప్రకటించిన రేవంత్‌.. వారికి ఎలా ప్రోత్సాహ‌కాలు ఇచ్చారో అలాగే ఇవ్వాల‌ని డిమాండ్‌..

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పత‌కం గెలిచిన నిఖత్ జరీన్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందించారు. ట్విట‌ర్ వేదిక‌గా నిఖత్ జరీన్ కు 5 లక్షల పారితోషికం ప్రకటించిన రేవంత్‌.. ఆమె సాధించిన ఘ‌న విజ‌యంపై.. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. అలాగే.. గ‌తంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా లకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహ‌కాలు ఇచ్చినట్టే.. నిఖాత్ జరీన్ కు ప్రోత్సాహ‌కం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే.. రెండు రోజుల క్రితం టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన‌ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ పోటీల్లో 52 కిలోల విభాగంలో.. థాయ్ లాండ్ దేశానికి చెందిన జిట్ పాంగ్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకిరణం నిఖత్ జరీన్ ఈ విజ‌యంతో చరిత్ర సృష్టించింది. ఆమె గెలుపుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.









Next Story