మహాత్ముడి స్పూర్తితో విశ్చిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొడదాం : రేవంత్ రెడ్డి
Revanth Reddy Addresess the occasion of Gandhi Jayanti. మహాత్మాగాంధీ స్పూర్తితో దేశంలో, రాష్ట్రంలో విశ్చిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
By Medi Samrat Published on 2 Oct 2022 9:54 AM GMTమహాత్మాగాంధీ స్పూర్తితో దేశంలో, రాష్ట్రంలో విశ్చిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన గాంధీ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ అనే విష వృక్షం దేశాన్ని కబలించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్, మోదీ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని.. ఇద్దరూ విభజించు పాలించు విధానాన్ని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఇద్దరూ తమ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ముందుకు రావాలని కోరారు.
వారి కుట్రలను తిప్పికొట్టేందుకే భారత్ జోడో యాత్ర
దేశంలో మోదీ అవలంబిస్తున్న విభజించు పాలించు విధానాన్ని రాష్ట్రంలో కేసీఆర్ కూడా అవలంభిస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇద్దరూ ప్రజల మధ్య విద్వేషపు గోడలు నిర్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. చవకబారు నేతల విభజించు పాలించు విధానాలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ పాదయాత్రకు తెలంగాణ రాష్ట్రం తరపున సంపూర్ణంగా అండగా ఉంటామని ఆయన అన్నారు. అక్టోబర్ 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందని తేపిపారు. గాంధీ స్పూర్తితో ప్రజలంతా భారత్ జోడో యాత్రలో కదం కదం కలపాలని కోరారు.
మన మహాత్ముడు ప్రపంచానికే ఆదర్శం
ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన మహాత్మా గాంధీ అని అన్నారు రేవంత్. శాంతియుత పోరాటంలో ప్రపంచానికి ఆయన ఆదర్శంగా ఉండటం మన దేశానికే గర్వకారణమన్నారు. మర పిరంగులతో రాజ్యాలను ఏలుతున్న బ్రిటీషర్లపై శాంతియుత పోరాటం చేసిన మహనీయడు గాంధీ అని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంతో డూ ఆర్ డై అని పిలుపునిచ్చి దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని తెలిపారు. ఆయన స్పూర్తితో దేశ తొలి ప్రధాని నెహ హరిత విప్లవం తీసుకొచ్చారని... సాగినీటిని రైతులకు అందించి దేశంలో దారిద్ర్యం ను పారద్రోలారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించి అణగారిన వర్గాలకు అధికారం అందించిన శక్తి కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి తెలిపారు.