సీనియర్ నేత వీ. హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని నూతన పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీహెచ్ ఆరోగ్యం కుదటపడిందని.. హాస్పిటల్ లో ఉన్న.. ప్రజా సమస్యలపై నాతో చర్చించారని అన్నారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారని.. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై రేవంత్ ఫైర్ అయ్యారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారని.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. దళిత ఎపోవర్‌మెంట్ అని కేవలం నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహమని అన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. పార్టీ అభివృద్ధి విషయంలో వీహెచ్ కొన్ని సలహాలు ఇచ్చారని.. మేడమ్ సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారని.. వీహెచ్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అన్నారు.