ప్రతీ గుండెకు ఆ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర : రేవంత్ రెడ్డి

Revanth Reddy About Hath Se Hath Jodo Yathra. సెప్టెంబర్ 7, 2022న రాహుల్ గాంధీ ఒక ఉక్కు సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టారని..

By Medi Samrat  Published on  21 Jan 2023 9:25 AM GMT
ప్రతీ గుండెకు ఆ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర : రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 7, 2022న రాహుల్ గాంధీ ఒక ఉక్కు సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టారని.. కోట్లాది మందిని కలుస్తూ వారికి భరోసాను ఇస్తూ ముందుకెళుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్ లో టీపీసీసీ పూర్తిస్తాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ అని.. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారని.. ఎండ, వాన, చలి.. అన్ని పరిస్థితులను తట్టుకుని ముందుకెళుతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ పై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తోందని.. బీజేపీ ఆలోచన విధానం వారి మాటల్లోనే వ్యక్తమవుతోందని రేవంత్ విమ‌ర్శించారు. రాహుల్ జోడో యాత్ర విజయవంతమైందని తెలిపారు.

ప్రతీ గుండెకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర అని వెల్ల‌డించారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగానే హాత్ సే హాత్ జోడో యాత్ర చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26న రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని.. శ్రీనగర్ లో జెండా ఎగరవేయకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని మండిప‌డ్డారు. శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగరేసి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అందుకే జనవరి 26 బదులుగా జనవరి 30న శ్రీనగర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story