రేవంత్ ఎన్నికల ప్రచారం : 63 నియోజకవర్గాలు.. 87 సభలు.. వివ‌రాలివే..!

తెలంగాణ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ప్రచారం నిర్వహించారు.

By Medi Samrat  Published on  28 Nov 2023 12:38 PM GMT
రేవంత్ ఎన్నికల ప్రచారం : 63 నియోజకవర్గాలు.. 87 సభలు.. వివ‌రాలివే..!

తెలంగాణ ఎన్నికల నేప‌ధ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతటా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకూ రేవంత్ రెడ్డి దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షోతో కలపుకొని దాదాపు 87 ప్రచార సభలో పాల్లొన్నారు.

వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.

Next Story