తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యే హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఉత్తర్వులు సరికాదని భావించిన హైకోర్టు వాటిని సస్పెండ్ చేసింది. పిటిషనర్ రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కె. చంద్రశేఖర రావు, హరీష్‌రావు తరపు న్యాయవాది వాదిస్తూ సెషన్స్ కోర్టుకు ఈ వ్యవహారంపై అధికార పరిధి లేదని వాదించారు. తదుపరి విచారణ జనవరి 7న జరగనుంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్‌రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్‌రావు కారణమంటూ జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.