కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఇద్దరి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు..కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు కమిషన్‌తో సంబంధం కోర్టుకు వివరించారు. వాదనలు విన్న కోర్టు.. వెకేషన్ తర్వాత విచారణ చేపడతామని తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.