రాఖీ వేడుక‌లు.. పాదాభివందనం చేసిన సీఎం కేసీఆర్

రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  31 Aug 2023 4:08 PM IST
రాఖీ వేడుక‌లు.. పాదాభివందనం చేసిన సీఎం కేసీఆర్

రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ వారికి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ తదితరులు పాల్గొన్నారు.

రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావును కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారు. రక్షా బంధన్ సందర్భంగా ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందని, వారి భద్రత, రక్షణ, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని హరీశ్‌ రావు తెలిపారు.

Next Story