మరోసారి విచారణకు హాజరైన రాజ్ పాకాల

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది, జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు

By Medi Samrat  Published on  1 Nov 2024 11:30 AM GMT
మరోసారి విచారణకు హాజరైన రాజ్ పాకాల

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది, జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. జన్వాడ ఫాంహౌస్ కేసులో రాజ్ పాకాల, విజయ్ మద్దూరిపై కేసు నమోదవ్వగా నేడు రంగారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదితో కలిసి రాజ్ పాకాల వచ్చారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. రెండు రోజుల క్రితం, మోకిల పోలీసులు రాజ్ పాకాలను దాదాపు ఏడు గంటల పాటూ విచారించారు. పోలీసులు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో దాడి చేసిన తరువాత అతనిపై నమోదైన కేసుకు సంబంధించి బుధవారం కూడా పోలీసుల ముందు హాజరయ్యారు. ఫామ్‌హౌస్‌లో పార్టీ పెట్టిన రాజ్ పాకాల, అతిథుల్లో ఒకరు కొకైన్‌కు పాజిటివ్ అని ఆరోపణలు వచ్చాయి. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద బుక్ చేశారు. ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు రాజ్ పాకాలపై మరో కేసు నమోదైంది. ఈ ఘటన తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ చిచ్చు రేపింది.

Next Story