తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
By అంజి Published on 18 March 2024 6:18 AM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు వడగళ్ల వాన పడే అవకాశమున్నట్లుగా తెలిపింది. .ఓవైపు మండుటెండలతో విలవిల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగ, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి తెలంగాణలో మేఘాలు బాగా పెరుగుతాయి. అలాగే.. ఉత్తర, వాయవ్య తెలంగాణలో జల్లులు కురుస్తాయి. ఈ వానలు రాత్రి 8 గంటల వరకూ కురుస్తాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కరీంనగర్, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.