బుధవారం నాడు పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీకి వర్షం ముప్పు తప్పిందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడ్రోజుల్లో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గి, పగటి ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.