తెలంగాణకు మరో రెండు రోజులు వర్షం ముప్పు

Rain Alert to Telangana. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది

By Medi Samrat  Published on  7 May 2023 5:22 PM IST
తెలంగాణకు మరో రెండు రోజులు వర్షం ముప్పు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెడల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ వనపర్తి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే ఈ నెల 9 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


Next Story