సోమవారం ఏర్పడిన అల్పపీడనం దక్షిణ గాంగ్‌టక్, పశ్చిమ బంగాల్ మరియు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కీ.మీ ఎత్తు వరకు స్థిరంగా ఉండి, ఎత్తుకి వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగివుంది. ఉపరితల ద్రోణి దక్షిణ గాంగ్‌టక్, పశ్చిమ బంగాల్ మరియు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం నుండి ఇంటీరియర్ ఒడిస్సా మీదుగా తెలంగాణా వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కీ.మీ ఎత్తు వద్ద ఏర్పడింది.
దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు, రేపు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశములలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు చాలా జిల్లాలలో కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.