హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు

తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించింది

By Medi Samrat  Published on  27 Jun 2024 5:14 AM GMT
హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు

తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న క్రీమ్‌లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ పై జరిగిన దాడిలో, సోలబుల్ ఎసెన్స్, క్యాండీడ్ కరోండా వంటి ముడి ఆహార పదార్థాలను వాటి లేబుల్‌లపై పేర్కొన్న ఉష్ణోగ్రత ప్రకారం నిల్వ చేయడం లేదని బృందం కనుగొంది. అంతేకాకుండా, ఫుడ్ సెక్షన్‌లోని కార్మికులు హెయిర్ క్యాప్స్, గ్లౌజులు, మాస్క్‌లు, యూనిఫాం ధరించి కనిపించలేదు.

కర్మన్‌ఘాట్‌లో ఉన్న సప్తగిరి ఫుడ్స్‌లో, ఫుడ్ హ్యాండ్లర్ల కోసం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డులు FBO వద్ద అందుబాటులో లేవు. అంతేకాకుండా, పాల ఉత్పత్తుల రవాణా కోసం ఉద్దేశించిన వాహనానికి FSSAI లైసెన్స్/రిజిస్ట్రేషన్ లేదు. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, పీజీలు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో సహా పలు సంస్థల్లో గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డైరీ తయారీ యూనిట్లపై దాడులకు దిగారు.

Next Story