రాహుల్ గాంధీ.. ఇది ఎలాంటి వంచన.?: కేటీఆర్‌

అదానీ - మోదీ ఫొటోలు ప్రింట్‌ చేసిన టీ షర్టులతో రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్ట్‌ అయినప్పుడు, అదానీ - ఏవంత్‌ ఫొటోలతో టీ షర్టులు వేసుకున్న తమను అసెంబ్లీకి ఎందుకు రానివ్వలేదని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

By అంజి  Published on  10 Dec 2024 9:51 AM IST
Rahul Gandhi, KTR, CM Revanth, Gowtham Adani, Telangana

రాహుల్ గాంధీ ఇది ఎలాంటి వంచన?: కేటీఆర్‌

హైదరాబాద్‌: అదానీ - మోదీ ఫొటోలు ప్రింట్‌ చేసిన టీ షర్టులతో రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్ట్‌ అయినప్పుడు, అదానీ - రేవంత్‌ ఫొటోలతో టీ షర్టులు వేసుకున్న తమను అసెంబ్లీకి ఎందుకు రానివ్వలేదని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. 'రాహుల్‌ గాంధీ గారు ఇది ఎలాంటి వంచన? మీ అడుగుజాడల్లో నడిచి అదానీ - రేవంత్‌ అఫైర్‌ను బయటపెడదామనుకున్నాం. కానీ మమ్మల్ని రానివ్వలేదు. దీనికి మీరు సమాధానం చెప్పాలి' అని పేర్కొన్నారు.

తెలంగాణ శాసనసభ ఉభయ సభలు సోమవారం (డిసెంబర్ 9, 2024) సమావేశమైనందున భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెలంగాణ అసెంబ్లీ ప్రవేశ (గేట్) ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శీతాకాల సమావేశాలలో భాగంగా బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ చిత్రాలతో కూడిన టీ-షర్టులను ధరించి నిరసన తెలిపారు.

ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్దకు చేరుకున్న శాసనసభ్యులు అసెంబ్లీ-కౌన్సిల్ ఆవరణకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి, అదానీల చిత్రాలతో కూడిన టీ షర్టులు ధరించిన బీఆర్‌ఎస్ శాసనసభ్యులను ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసు సిబ్బంది అనుమతించకపోవడంతో శాసనసభ్యులు, పోలీసు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Next Story