తెలంగాణ జరుగుతోన్న అరాచకత్వానికి రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పాత్రికేయులను సైతం అరెస్టు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik
తెలంగాణ జరుగుతోన్న అరాచకత్వానికి రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పాత్రికేయులను సైతం అరెస్టు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి గొంతునూ బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను కూడా విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నారని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల పచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడాని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన హక్కుని అణచివేస్తున్న తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈ విధంగా జరుగుతున్న అరాచకత్వానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దేశంలోని ప్రతి పట్టణానికి వెళ్లి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తారని, కానీ తెలంగాణలో తమ సొంత పార్టీ పాలనలో జరుగుతున్న అరాచకత్వంపై మౌనంగా ఎందుకు ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఇప్పటికైనా పక్కన పెట్టి, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలన చేసేలా తమ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ రాహుల్ గాంధీకి సూచించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టు భేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
The draconian police overreach in Telangana is alarming! Journalists are being detained & dissenting voices arrested. This blatant suppression of free speech & expression is unacceptable.And @RahulGandhi goes to town preaching about democracy and free speechThe double… https://t.co/tRDPyndwc2
— KTR (@KTRBRS) March 30, 2025