రాహుల్ గాంధీ అరెస్ట్
Rahul Gandhi detained during Congress protest against Centre. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on
5 Aug 2022 11:24 AM GMT

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.
పార్టీకి చెందిన నేతలంతా నలుపు రంగు దుస్తులేసుకుని రోడ్లపైకి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా నలుపు రంగు దుస్తులేసుకుని రోడ్డు మీదకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ శ్రేణులను ముందుండి నడిపించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్ లను ఏర్పాటు చేశారు. బారికేడ్‌లను సైతం లెక్కచేయని ప్రియాంక... అవలీలగా బారికేడ్‌ను ఎక్కి దానిపై నుంచి దూకారు. కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story