10 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోని కవితకు స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పుష్ప లీల అన్నారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదన్నారు. రేవంత్‌ను ప్రశ్నించడానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుందని ఎద్దేవా చేశారు. కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్ కి పట్టలేదన్నారు. ట్రైబల్, అసైన్మెంట్ చట్టంలో స్త్రీకి గౌరవం ఇచ్చింది ఇందిరా గాంధీ అని పేర్కొన్నారు.
కేసీఆర్ లాంటి ద్రోహి బిడ్డవి నువ్వు.. కేటీఆర్ ను మించిపొయ్యావని విమర్శించారు. కొంగ దొంగ జపం లాగా .. మహాశివ రాత్రి రోజు నీ అబద్దాల ధర్నా ఉందన్నారు. సోనియా గాంధీ బిక్ష వల్ల మీ ఫ్యామిలీకి రాజకీయ జీవితం వచ్చిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనటానికి.. రైతులకు లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికిందన్నారు. ట్రైబల్, బీసీ మహిళలు, ఎస్సీ మహిళలకు చదువుకోవడం కోసం కల్పించిన అవకాశం అది.. సమాన అవకాశాలూ గత పదేళ్ళలో కవితకి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. లిక్కర్ కేస్ లో ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని కవిత రోజు ప్రజల్లోకి వస్తూ.. డ్రామాలు ఆడుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికలలో దొంగ మాటలు మాట్లాడే బీఆర్ఎస్‌కు మహిళలు బుద్ధి చెప్తారన్నారు.