4 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌కు వెళ్లారు. తెలంగాణకు భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా ఫ్రాన్స్‌లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఆదివారం నాడు పారిస్‌లోని లక్సెంబర్గ్‌లో ఓ పిలుపు విని మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. తెలుగులో.. 'రామారావు గారూ బాగున్నారా' అంటూ ప్రొఫెసర్ డేనియల్ నెగ్గర్స్ మంత్రి కేటీఆర్‌ను పలకరించారు. తెలుగులో ఆత్మీయ పలకరింపు విన్న కేటీఆర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అక్కడ తెలుగు వారు ఎవరు ఉన్నారా అంటూ అటు ఇటూ చూశాడు.
ఇదే సమయంలో రామారావు గారు.. నేనే మాట్లాడేది అంటూ ఫ్రాన్స్‌కు చెందిన ప్రొఫెసర్ డేనియల్ నెగ్గర్స్ కేటీఆర్‌తో అన్నారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను పలు మార్లు సందర్శించానని నెగ్గర్స్ తెలిపారు. తెలుగు భాష నేర్చుకుని ఫ్రాన్స్ యూనివర్సిటీలో జాతీయ ప్రాచ్య భాష సంస్కృతుల సంస్థలో 30 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నానని తెలిపారు. ప్రొఫెసర్ నెగ్గర్స్ కృషికి మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు వారిద్దరూ మట్లాడుకున్నారు. త్వరలో హైదరాబాద్ రావాలని నెగ్గర్స్‌ను కోరారు. సీఎం కేసీఆర్‌ని కలవాలంటూ.. పోచంపల్లి శాలువాతో సత్కారం చేశారు.