తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన
కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఆదివారం నాడు తెలంగాణకు రానున్నారు.
By Medi Samrat Published on 18 Nov 2023 9:15 PM ISTకాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఆదివారం నాడు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు. ఆదివారం నాడు ప్రియాంక గాంధీ ఖానాపూర్, అసిఫాబాద్‌లలో పర్యటించనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి నాందేడ్ చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖానాపూర్ చేరుకుంటారు. అక్కడ గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసిఫాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు.
శుక్రవారం నాడు పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మణుగూరులో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదు.. రక్త సంబంధం అని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది.