ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పెయింట్

తెలంగాణ ఎన్నిక‌ల ఫలితాలు మ‌రికొద్ది గంటల్లో విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో గెలుపుపై..

By Medi Samrat  Published on  2 Dec 2023 4:34 PM IST
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పెయింట్

తెలంగాణ ఎన్నిక‌ల ఫలితాలు మ‌రికొద్ది గంటల్లో విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో గెలుపుపై అధికార బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ ఫ‌లితాలు కాంగ్రెస్ దే గెలుపు అని ప్ర‌క‌టించాయి. అయితే.. ఎగ్జిట్ ఫోల్స్‌.. ఎగ్జాక్ట్ పోల్స్ కాద‌ని బీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. మూడో సారి తామే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని కేటీఆర్, క‌విత, ఇత‌ర బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఎక్క‌డా కూడా త‌గ్గడం లేదు. అందులో భాగంగానే సోమ‌వారం మ‌ధ్యాహ్నం కేబినెట్ భేటీ కూడా ఉంటుంద‌ని సీఎంవో వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలావుంటే.. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు సున్నం (పెయింట్‌) వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను టీఆర్ఎస్ నాయ‌కుడు, టీఎస్ఎండీసీ ఛైర్మ‌న్ మ‌న్నె క్రిశాంక్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. ద‌టీజ్‌ సీఎం కేసీఆర్.. కేసీఆర్ 3వ ప‌ర్యాయం కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌కు రంగులు వేస్తున్నారని రాసుకొచ్చాడు. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేత‌ల కాన్ఫిడెన్స్ ఫ‌లితాల‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

Next Story