మార్పు రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి : పొంగులేటి

రాష్ట్రంలో మార్పు రావాలంటే బీఆర్​ఎస్​ను ఓడించేందుకు కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి

By Medi Samrat  Published on  17 Nov 2023 3:45 PM GMT
మార్పు రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి : పొంగులేటి

రాష్ట్రంలో మార్పు రావాలంటే బీఆర్​ఎస్​ను ఓడించేందుకు కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని.. కాంగ్రెస్​ తెలంగాణ ఇస్తే కేసీఆర్​ దోచుకొని తినడం మొదలుపెట్టాడని అటువంటి పందికొక్కైన కేసీఆర్​ను ఇంటికి పంపాల్సిన సమయం అసన్నమైందని పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్​ మండలం ఆరెకోడు, ఆరెకోడుతండా తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొరల పరిపాలనకు, దోపిడీ పరిపాలనకు, ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న యుద్ధం అని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికలకు ఈ ఎన్నికలు పూర్తి బిన్నంగా ఉంటాయన్నారు.

ఆనాడు ఉద్యమం చేశామని చెపుతున్న ఈ ప్రబుద్ధుడు ప్రజలను విస్మరించి సంపాదనే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు. 2014కు ముందు కేసీఆర్ ఆస్థులెంత..? ఇప్పుడు ఆస్తులు ఎంత అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంతో మంది పోరాట ఫలితంగా తెలంగాణ వస్తే ఈనాడు కేవలం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చిందా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూశారని కానీ నోటిఫికేషన్​లు రద్ధు, పేపర్​ లీకేజీలతోనే సమయాన్ని గడిపి నిరుద్యోగులతో చలగాటం ఆడుకున్నాన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే రాలేదు కానీ కేసీఆర్ కుటుంబం లో మాత్రం ఆరు ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఎద్దేవ చేశారు. గత ఎన్నికల్లో 14 రోజుల ముందు పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థికి బీఫామ్ ఇస్తే ఆనాడు పొత్తులో ఉన్న పార్టీలు గెలిపించాయని, గెలిచిన మూడు నెలల్లోనే ఆయన అధికార పార్టీలోకి జంప్ అయ్యారన్నారు. ప్రజలు ఎందుకు పార్టీ మారారు అని అడిగితే అభివృద్ధి కోసం మారిన అని చెప్పారని.. అభివృద్ది మాత్రం నిల్​.. దొపిడి మాత్రం ఫుల్ గా ఉందని విమర్శించారు.

Next Story