తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు.
మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవం అయింది. ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన 414 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 412 వార్డులకు పోలింగ్ నిర్వహించారు.