కేఏ పాల్ హౌస్ అరెస్ట్

Police House Arrested KA Paul. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

By Medi Samrat
Published on : 31 Jan 2023 5:01 PM IST

కేఏ పాల్ హౌస్ అరెస్ట్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొత్త సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు బ‌య‌లుదేరిన కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించవద్దని, ఏప్రిల్ 14న ప్రారంభించాలని పాల్ డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేద్క‌ర్ పేరు పెట్టి.. కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించడం ఏంటని కేఏ పాల్ ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ త‌దిత‌రులు హాజరుకానున్నారు.



Next Story