తండ్రి లీగల్ వ్యాపారి.. కొడుకుది మాత్రం ఇల్లీగల్ దందా..

తండ్రి లీగల్ బిజినెస్ చేస్తుండగా.. కొడుకు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు.. దీంతో పోలీసులు కొడుకులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2024 8:02 PM IST
తండ్రి లీగల్ వ్యాపారి.. కొడుకుది మాత్రం ఇల్లీగల్ దందా..

తండ్రి లీగల్ బిజినెస్ చేస్తుండగా.. కొడుకు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు.. దీంతో పోలీసులు కొడుకులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.. ఇంతకు కొడుకు ఏం వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు అరెస్టు చేశారు అని ఆలోచిస్తున్నారా.. తండ్రి బియ్యం వ్యాపారం చేయగా.. కొడుకు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు.. అందుకే పోలీసులు అతన్ని అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్తానానికి పంపారు.

లీలా కృష్ణ(24) అనే యువకుడు డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకందారుగా మారాడు. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా అది చిటికలో సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇలా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో లీలా కృష్ణ ఎంజాయ్ చేస్తున్నాడు. నిజాంపేట్ కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌ సీఐ నాగరాజు బృందం ఆ ప్రాంతంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. లీలా కృష్ణ బ్యాగులో డ్రగ్స్ ను పెట్టుకొని అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎక్సైజ్ పోలీసులకు అనుమానం వచ్చి అతని బ్యాగులో తనిఖీలు నిర్వహించగా 17.07 ఓజీ కుష్ గంజాయి, 2.34. గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 2 ఎల్‌ఎస్డీ బ్లాస్ట్, 220 గ్రాముల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన డ్రగ్స్ గంజాయి విలువ రూ.1.40 లక్షలు గా ఉంటుందని సీఐ తెలిపారు. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు పట్టుబడిన లీలా కృష్ణ 2022, 2023 లో ఎస్ఓటి పోలీసులకు పట్టుబడ్డాడు. 2024 మేలో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులకు పట్టుబడ్డాడు. గ‌తంలో మూడుసార్లు జైలుకు వెళ్లి వచ్చినటువంటి లీలా కృష్ణ నాలుగో సారి కూడా డ్రగ్స్ అమ్ముతూ ఎస్టిఎఫ్ పోలీసులకు పట్టు బడ్డాడు. ఇతను గోవాలోని అంజనా బీచ్ లో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారి వద్ద డ్రగ్సును కొనుగోలు చేసి.. దానిని హైదరాబాదుకు తీసుకువచ్చి ఇన్‌స్టా వేదిక‌గా అందరికీ అమ్మ కాలు చేస్తాడు. తండ్రి బియ్యం వ్యాపారం చేస్తుంటే కొడుకు కొడుకు లీలా కృష్ణ మాత్రం డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టు బడ్డాడు

Next Story