ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు..!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ముందు కట్టేసిన ఘటన గురించి

By Medi Samrat
Published on : 14 Dec 2023 8:45 PM IST

ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు..!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ముందు కట్టేసిన ఘటన గురించి ప్రజలు తెగ చర్చించుకుంటూ ఉన్నారు. జిల్లాలోని చెన్నూరులో నివసించే మల్లన్న అనే రైతుకు ఆవులు, ఎద్దులు ఉన్నాయి. ఆ రైతు తన ఎద్దును మేతకని విడిచిపెట్టాడు. దీంతో ఆ ఎద్దు పక్క ఊరి పొలంలో దిగి మేత మేస్తుండగా ఆ పొలం యజమాని సర్ధార్ చూశాడు. సాగు చేసుకునే పొలాన్ని మేస్తూ ఉండడంతో ఆయనకు కోపమొచ్చింది. ఎద్దును తీసుకెళ్లి తన ఇంటివద్ద కట్టేశాడు. సాయంత్రం అయినా తన ఎద్దు ఇంటికి రాకపోయేసరికి యజమాని దానిని వెతుక్కుంటు వచ్చేశాడు.

సర్ధార్ ఇంటి ముందు ఎద్దు ఉండడం చూసి మల్లన్న గొడవకు దిగాడు. నీ ఎద్దు వల్ల పొలం పాడైందని.. ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ గొడవను పెద్దది చేశాడు సర్దార్. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో మల్లన్న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఎద్దును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కట్టేశారు. దీంతో ఎద్దు పోలీస్ స్టేషన్ ముందు గత రెండు రోజులుగా ఉంది. దీంతో పాపం ఎద్దుకు నీళ్లు మేత లేక అల్లాడిపోవడంతో పోలీసులు ఎద్దును తోలుకెళ్లమని యజమాని మల్లన్నకు చెప్పారు.

Next Story