బ్రేకింగ్ : ఈ నెల‌ 30 నుంచి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ

Podu Land Pattas Distribution On June 30th. ఈ నెల 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు

By Medi Samrat
Published on : 24 Jun 2023 4:17 PM IST

బ్రేకింగ్ : ఈ నెల‌ 30 నుంచి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ

ఈ నెల 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి జూన్ 30న సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.

కాగా, ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత ఈనెల 30వ తేదీకి మార్చవలసి వచ్చింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి శుక్ర‌వారం, శ‌నివారం జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహస్తుండడం, ఈ నెల 29న బక్రీద్ పండుగ వుండడం వంటి కారణాలరీత్యా ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని సీఎంవో కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.


Next Story