హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటించింది. ఏప్రిల్ 30న అందోల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు, అనంతరం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో పాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మే 3న వరంగల్, భువనగిరి, నల్గొండలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మే 4న నారాయణపేట, వికారాబాద్‌లలో జరిగే సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని పార్టీ తెలిపింది.
రేపు సిద్దిపేటకు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25 బుధవారం సిద్దిపేటలో బహిరంగ సభలో ప్రసంగిస్తారని, మెదక్ బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు కోసం ప్రచారం చేస్తారని పార్టీ తెలిపింది.
రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.11.45 నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడ గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 2.15 గంటలకు బేగంపేట నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.