తెలంగాణ‌పై ప్ర‌ధాని మోదీ వ‌రాల జ‌ల్లు

పాలమూరులో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. జిల్లాలో రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు

By Medi Samrat  Published on  1 Oct 2023 3:43 PM IST
తెలంగాణ‌పై ప్ర‌ధాని మోదీ వ‌రాల జ‌ల్లు

పాలమూరులో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. జిల్లాలో రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంత‌రం ప్రజాగర్జన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ ప్ర‌ధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ప‌లు కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్టు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పసుపు రైతుల కష్టాల గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా తర్వాత పసుపు వినియోగం పెరిగిందన్నారు. తెలంగాణలో రైతులు పసుపును ఎక్కువ పండిస్తున్నారని.. పసుపు బోర్టు ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కరోనా తర్వాత పసుపు గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు.

అలాగే.. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ములుగు జిల్లాలో ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ. 900 కోట్లతో కేంద్రీయ ట్రైబల్ యూనివర్సిటీని నిర్మిస్తామన్నారు. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క, సారలమ్మ వనదేవతల పేర్లు పెడడతామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఏ హామీ ఇచ్చినా.. తాము చిత్తశుద్దితో సంతోషంతో ప్రకటిస్తామన్నామ‌ని మోదీ పేర్కొన్నారు.

Next Story