కాళేశ్వరం కమిషన్ నివేదికపై పిటిషన్లు..హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. దీంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన రిప్లయ్ కౌంటర్ దాఖలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి చర్యలు వద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.