బీజేపీకి షాకిచ్చిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Resigned For BJP. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్

By Medi Samrat  Published on  26 July 2021 1:45 PM GMT
బీజేపీకి షాకిచ్చిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో.. పెద్దిరెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఈటల రాజేంద‌ర్‌ రాకను పెద్దిరెడ్డి గ‌ట్టిగా వ్యతిరేకించారు. అయినా.. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంతో పెద్దిరెడ్డి తీవ్ర‌ నిరాశ చెందారు. దీంతో మారిన రాజకీయ పరిస్థితుల నేఫ‌థ్యంలో బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పెద్దిరెడ్డి రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ నేఫ‌థ్యంలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి.. హుజురాబాద్ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని భావించారు.. అందులో భాగంగానే ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే.. తాను మద్దతు ఇవ్వనని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే.. ఈటల బీజేపీలో చేరడంపై.. తనను ఎవరూ సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో.. హుజురాబాద్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పార్టీని వీడ‌గా.. నేడు పెద్దిరెడ్డి పార్టీ రాజీనామా చేయ‌డం హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ‌ బీజేపీకి కోలుకోలేని దెబ్బ‌ అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.





Next Story