రేవంత్‌కు 100 మార్కులు.. ప్రభుత్వానికి అవమానం 2.. రాజ్యపూజ్యం..16 : జగ్గారెడ్డి

పీసీసీ, సీఎం ఒక్కరే ఉంటే బాగుంటుంది అనే కంటిన్యూ అవుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  9 April 2024 4:42 PM IST
రేవంత్‌కు 100 మార్కులు.. ప్రభుత్వానికి అవమానం 2.. రాజ్యపూజ్యం..16 : జగ్గారెడ్డి

పీసీసీ, సీఎం ఒక్కరే ఉంటే బాగుంటుంది అనే కంటిన్యూ అవుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడుతున్నార‌ని.. న్యూట్రల్ గా ఉండి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామన్నారు. బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాట్లాడితే.. రాజకీయ మాటలే వస్తాయన్నారు.

రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. రాహుల్ గాంధీ అధికారం కోసం అడ్డదారులు తొక్కరన్నారు. ఇప్పుడు ఏతులు నరుకుతున్న బీజేపీ వాళ్లేవరు స్వతంత్ర ఉద్యమంలో పుట్టలేదన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ .. అమిత్ షా విధానమ‌న్నారు. అవగాహన లేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

Pk ఓ సారి బీజేపీ అంటాడు..ఇంకోసారి కాంగ్రెస్ అంటాడని.. ఆయన బతుకుదేరువు కోసం పెట్టుకుంది సర్వే సంస్ధ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారు అని చెప్పాడు పీకే.. కాంగ్రెస్ గెలిసింది.. కాంగ్రెస్ అధికారంలోకి వర్షా కాలంలో రాలేద‌న్నారు. వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా..? బీఆర్ఎస్‌ వాళ్లకు అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ లో కింగ్.. కింగ్ మేకర్ ఆయనే.. కేసీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నార‌ని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడని విమ‌ర్శించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 12 నుండి 14 ఎంపీ సీట్లు గెలుస్తామ‌న్నారు.

బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని ఆడిగావా..? కేంద్ర మంత్రి చేయాలని డిమాండ్ అయినా చేశావా..? బంగారు లక్ష్మణ్ ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించావా..? మీరా కుమార్‌ను స్పీకర్ చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్ర‌శ్న‌లు సంధించారు. జగ్గారెడ్డి దేనికి కక్కుర్తి పడడన్నారు. రేవంత్ కి 100 మార్కులు వేస్తున్నా.. ప్రభుత్వానికి అవమానం 2.. అది కూడా ప్రతిపక్షాలతోనే.. రాజ్యపూజ్యం..16.. ప్రజలు హ్యాపీగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఆర్టీసీ లో ప్రయాణం చేసే మహిళల్ని అడగండి. ప్రజా ధనం ప్రజలకే ఉపయోగం అవుతున్నాయి నిధులు.. పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడలేనన్నారు. నేనే పార్టీలు మారి వచ్చాన‌న్నారు.

Next Story