తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. నల్గొండలో బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని ముందే ప్రకటించింది తెలంగాణ బీజేపీ. తాజాగా పవన్ పర్యటన రద్దు అయినట్టు వెల్లడించింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత కారణాలతో పవన్ పర్యటన రద్దయ్యిందని ప్రకటన రావడంతో జనసేన క్యాడర్ నిరుత్సాహపడింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల B-ఫారమ్‌లు దాఖలు చేయగా, స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారు.
జిల్లాల వారీగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య
నిజామాబాద్ – 48
కొత్తగూడెం – 22
రంగారెడ్డి – 21
ఖమ్మం – 17
వరంగల్ – 20
నల్గొండ – 46
మహబూబ్‌నగర్ – 44
మహబూబాబాద్ – 5
మెదక్ – 18
కరీంనగర్ – 56
ఆదిలాబాద్ – 39
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనుంది.